NTV Telugu Site icon

Krithi Shetty: యాంకర్ల ఓవరాక్షన్.. ఏడ్చేసిన నటి

Krithi Shetty Cried On Live Show

Krithi Shetty Cried On Live Show

సెలెబ్రిటీలను షోస్ లేదా ఇంటర్వ్యూలకి పిలిచి.. అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటారు. ఏదో పెద్ద ఘోరమే జరిగినట్టు మొదట్లో ఓవర్ బిల్డప్ ఇచ్చి.. ఆ తర్వాత ఇదంతా ప్రాంక్ అంటూ చావు కబురు చల్లగా చెప్తుంటారు. కాకపోతే.. అది హద్దు మీరకుండా ఒక పరిమితి వరకు ఉంటే బెటర్. హద్దు మీరితే మాత్రం.. తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న వ్యవహారమే ప్రత్యక్ష సాక్ష్యం. తమ షోకి పిలిచిన ఇద్దరు యాంకర్స్.. ప్రాంక్ పేరుతో ఓవరాక్షన్ చేశారు. దీంతో జడుసుకున్న కృతీ శెట్టి.. లైవ్‌లోనే కంటతడి పెట్టేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

తాజాగా ఓ అవార్డు ప్రదానోత్సవంలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కృతీ.. ఆ తర్వాత ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్స్ పాల్గొనగా, అందులో ఒకరు మాత్రమే వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి కృతి నవ్వుతూ సమాధానాలు చెప్తోంది. ఇంతలో మరో యాంకర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ‘‘ప్రశ్నలన్నీ నువ్వే అడిగితే, ఇక నేనెందుకు? ఈ ఇంటర్వ్యూలో నన్నెందుకు కూర్చోబెట్టారు? ఇలా బొమ్మలా కూర్చోవడానికి ఇంత ఖరీదైన దుస్తులెందుకు? ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవరు?’’ అంటూ కెమెరా ఆఫ్ చేయాల్సిందిగా కేకలు వేశాడు. అనంతరం ఇద్దరు యాంకర్స్ వాగ్వాదానికి దిగారు. అక్కడే కూర్చున్న కృతీ శెట్టి.. ఈ మొత్తం వ్యవహారం చూసి ఖంగుతింది. భయాందోళనలకు గురైంది.

ఇంతలో ఇదంతా ప్రాంక్ అంటూ ఆ యాంకర్స్ ఇద్దరు కృతి దగ్గరకు వెళ్ళి చెప్పారు. పాపం.. అప్పటికే భయపడిపోయిన కృతీ, తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా ఏడ్చేసింది. అప్పుడు మిగతా టీమ్ అంతా వెళ్ళి ఆమెను ఓదార్చారు. కాసేపయ్యాక కుదురుకున్న కృతీ.. ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే తనకెంతో భయమని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కృతీని ఏడిపించేలా ప్రాంక్ చేయడంతో.. ఆ యాంకర్స్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇదో చెత్త ప్రాంక్ అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలే గానీ, ఇలా ఏడిపించేలా ఉండకూడదంటూ ఏకిపారేస్తున్నారు.

Show comments