Site icon NTV Telugu

Krithi Sanon: ప్యార్ లేదు, పీఆర్ కాదు… అతను ఓవర్ చేశాడు

Krithi Prabhas

Krithi Prabhas

ప్రభాస్ కృతి సనన్ ప్రేమలో ఉన్నారు అనే రూమర్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆన్లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా ఇదే టాపిక్ తిరుగుతోంది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు, త్వరలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎవరికి తోచిన స్క్రిప్ట్ వాళ్లు రాశారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ‘భేడియా’ ప్రమోషన్స్ లో కృతి సనన్ మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ప్రస్తుతం ‘దీపిక’తో సినిమా చేస్తున్నాడు అని చెప్పాడు. కృతి సనన్ కూడా ఇటివలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘అవకాశం వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పింది. దీంతో అప్పటికే స్ప్రెడ్ అవుతున్న రూమర్ కి మరింత బలాన్ని ఇచ్చినట్లు అయ్యింది. ఇండియా వైడ్ ప్రభాస్ కృతి సనన్ ల ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవ్వడంతో, కృతి సనన్ అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యింది.

ప్రభాస్ తో ప్రేమలో ఉన్నాను అనే విషయంలో నిజం లేదని స్పష్టం చేసింది. “అది ప్యార్ కాదు, పీఆర్ స్టంట్ కాదు. మా తోడేలు(వరుణ్ ధావన్) రియాలిటీ షోలో టూ వైల్డ్ అయ్యాడు. అతను చేసిన కామెడీ, అవసర రూమర్స్ కి కారణం అయ్యింది. నా పెళ్లి(ప్రభాస్ తో) తేదిని ఏదైనా వెబ్ సైట్ అనౌన్స్ చేయడం కన్నా ముందు, నేనే ఈ విషయాన్ని చెప్తున్నాను. బయటకి వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదు” అంటూ క్లీన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ప్రభాస్ అండ్ కృతి సనన్ లవ్ రూమర్ కి అఫీషియల్ గా ఎండ్ కార్డ్ పడినట్లు అయ్యింది. కొంతమంది ప్రభాస్ ఫాన్స్ మాత్రం మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మా హీరో పేరుని ఎందుకు వాడుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు.

Exit mobile version