Site icon NTV Telugu

Adipurush: నవమి నాడు… రాముడి సమేతంగా వచ్చిన సీతాదేవి

Adipurush

Adipurush

ఎక్కడ ఓడిపోయాడో, ఎక్కడ ట్రోలింగ్ ఫేస్ చేశాడో సరిగ్గా ఆరు నెలల్లో అక్కడే నిలబడి అందరితో జేజేలు కొట్టించుకుంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు, పాన్ ఇండియా సినిమా అనగానే ఆదిపురుష్ మూవీపై అంచనాలు భారిగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలని అందుకోవడంలో ఆదిపురుష్ టీజర్ ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రభాస్ ఫాన్స్ నుంచే బ్యాక్ లాష్ ఫేస్ చేసింది. దీంతో ఓం రౌత్ జనవరి నుంచి జూన్ 16కి షిఫ్ట్ చేశాడు. ఈ గ్యాప్ లో ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాకి రిపేర్లు చెయ్యడం మొదలుపెట్టాడు. దాని రిజల్ట్ ఈరోజు ఆదిపురుష్ సినిమాని ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్ గా మార్చింది. అక్షయత్రితీయ రోజున ‘జై శ్రీరామ్’ చాంటింగ్ తో మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి ఇండియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఈ ఒక్క పోస్టర్ ఆదిపురుష్ సినిమా తలరాతనే మార్చేసింది. ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు ప్రతి సినీ అభిమాని ఆదిపురుష్ వైపు తిరిగి చూసేలా చేసింది. ఈ పోస్టర్ క్రియేట్ చేసిన మ్యాజిక్ నుంచి బయటకి వచ్చే లోపే ఆదిపురుష్ సినిమా నుంచి మరో మాస్టర్ పీస్ లాంటి అప్డేట్ బయటకి వచ్చింది.

ఈరోజు సీతా నవమి కావడంతో(సీతాదేవి పుట్టిన రోజుగా భావిస్తారు) ఆదిపురుష్ సినిమా నుంచి కృతి సనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. “అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం” అంటూ ఓం రౌత్, కృతి సనన్ పోస్టర్ ని విడుదల చేశాడు. ఈ పోస్టర్ చూస్తే కృతి సనన్, సీతాదేవిగా చాలా బాగా సరిపోయినట్లు అనిపించింది. కృతి సనన్ ఫస్ట్ లుక్ మాత్రమే కాదు మోషన్ పోస్టర్ ని కూడా సీతా నవమి సంధర్భంగా రిలీజ్ చేశారు. ఈ రెండూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకున్నాయి. దీంతో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆదిపురుష్ ట్రెండ్ నడుస్తోంది. ఓం రౌత్ ఇదే జోష్ ని జూన్ 16 వరకూ మైంటైన్ చేస్తే చాలు ఆదిపురుష్ సినిమా ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడం గ్యారెంటీ.

 

Exit mobile version