Site icon NTV Telugu

‘గే’తో స్టార్ హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్ మెంట్.. త్వరలోనే పెళ్లి

ప్రస్తుతం సమాజంలో ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులకు ఇష్టంలేదనో.. సమాజం ఏమైనా అనుకుంటున్నదనో భయపడడం లేదు. ముఖ్యంగా గే మ్యారేజ్ లు ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. ఇద్దరు పురుషులు లేక ఇద్దరు మహిళలు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అది ఇప్పుడు చట్టబడం కూడా కావడంతో ఎవరికి భయపడడం లేదు.. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టెవర్ట్ తాను సహ నటి డైలాన్ మేయర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అంతేకాకుండా తామిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా అయినట్లు ప్రకటించింది.

క్రిస్టెన్ స్టెవర్ట్.. ‘ట్విలైట్ సాగా సిరీస్ ద్వారా తెలుగు వారికి సుపరిచితమే. గత కొన్ని రోజులుగా క్రిస్టెన్ మరియు డైలాన్ లు రిలేషన్ లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే ఒక షో కి గెస్ట్ గా వచ్చిన ఆమె తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటించింది. త్వరలో తమ పెళ్లి ఉండనున్నట్లు తెలిపింది. ఇంట్లో వ్యతిరేకత ఉన్నా.. తమకు నచ్చిన వారితో ఉంటె జీవితం సాఫీగా సాగుతుందనే నమ్మకంతో తన సహనటినే వివాహం చేసుకోనున్నట్లు ఆమె తెలిపింది.

Exit mobile version