Site icon NTV Telugu

Krishnam Raju: అనుష్కతో ప్రభాస్ పెళ్లి.. కృష్ణంరాజు ఏమనేవారంటే..?

Anushka

Anushka

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజుకు కడసారి వీడ్కోలు ఇవ్వడానికి ఆయన ఇంటికి బయల్దేరారు. ఇక సోషల్ మీడియా వేదికపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ అనుష్క ట్విట్టర్ వేదికగా ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. “మన కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. పెద్ద హృదయం, మంచి మనస్సు కలిగిన లెజెండ్. మీరెప్పుడు మా హృదయాల్లో జీవించే ఉంటారు” అని చెప్పుకొచ్చింది.

ఎన్నో ఏళ్లుగా ప్రభాస్- అనుష్క మధ్య ప్రేమ ఉందని, వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ విషయమై కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవి అన్ని పుకార్లే అని కొట్టిపడేశారు. వారిద్దరూ మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చిన ఆయన ప్రభాస్ పెళ్లి చేసుకొంటే చూడాలని ఉందని చెప్పుకొచ్చారు. “ప్రభాస్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతున్నాం. ప్రభాస్ పెళ్లి చేసుకొంటే అందరికంటే ఎక్కువ సంతోషించేది నేనే. ఇప్పుడు అతడితో కలిసి నటించాను.. రేపు వారి పిల్లలతో కూడా కలిసి నటించాలని ఉంది” అని తెలిపారు. ఈ కోరిక కూడా నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు.

Exit mobile version