నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రచారంలో జోరు పెంచింది యూనిట్. అందులో భాగంగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 14న తిరుపతి,15న నెల్లూరు, ఒంగోలు,16న విజయవాడ, గుంటూరు, ఏలూరు,17న భీమవరం, రాజమండ్రి, 18న కాకినాడ, వైజాగ్ లో హీరో నాగశౌర్యతో పాటు యూనిట్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులు, అభిమానులను కలసి సందడి చేయనుంది. రాధిక శరత్‌కుమార్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి అనుమతిని ఇస్తూ సంబంధిత పోలీస్ శాఖలకు పాదయాత్ర సమయంలో రక్షణ అందించవలసినదిగా ఎపి రాష్ట్ర డిజిపి ఆదేశాలను జారీ చేశారు. మరి ఈ పాదయాత్ర సినిమాకు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
