Site icon NTV Telugu

Naga Shaurya: కృష్ణ, వ్రింద ప్రణయపు తేదీ ఖరారు!

Krishna Vindu Vihari

Krishna Vindu Vihari

 

యంగ్ హీరో నాగశౌర్య, బ్యూటిఫుల్ హీరోయిన్ షెర్లీ సెటియా జంటగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను అనీశ్‌ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. అనివార్య కారణాలతో వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని ఎట్టకేలకు సెప్టెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు బుధవారం ప్రకటించారు. రాధిక కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలలో ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు కనిపించబోతున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించారు. అయితే… ఇప్పటికే సెప్టెంబర్ 23న శ్రీవిష్ణు ‘అల్లూరి’, శ్రీసింహ ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రాలు సైతం విడుదల కానున్నట్టు ప్రకటన వచ్చింది.

Exit mobile version