Site icon NTV Telugu

Krishna Vrinda Vihari: ఐఎమ్‌డీబీ టాప్-5లో ‘కృష్ణ వ్రింద విహారి’

Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari: నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ఇటీవల విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకున్న విషయం తెలిసినదే. తాజాగా రీజనల్ మూవీస్ విభాగంలో ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్ (ఐఎమ్‌డీబీ) టాప్ ట్రెండింగ్ లో ఈ సినిమా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియచేస్తూ తమ సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావటమే తమ సినిమా డీసెంట్ హిట్‌కు కారణమని, నాగశౌర్య, షెర్లీ సెటియా జంట కనువిందు చేయటంతో పాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రామకృష్ణ కామెడీ, రాధికా శరత్ కుమార్ మదర్ పాత్ర, మహతి స్వర సాగర్ అందించిన సంగీతం ఈ విజయానికి కారణాలని అంటున్నారు. ఈ సందర్భంగా తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నిర్మాతలు ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ మూల్పూరి కృతజ్ఞతలు తెలియచేశారు.

Read Also: God Father: సాధారణ ధరలకే ‘గాడ్ ఫాదర్’ మూవీ టిక్కెట్లు

Exit mobile version