Krishna Gadu Ante Oka Range Pre Release Event: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ రిలీజ్ కి రెడీ అయింది. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ దొండపాటి డైరెక్ట్ చేశారు. ఆగస్ట్ 4న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రిలీజ్ కానున్న క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ వేదికపై ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’కు ఆల్ ది బెస్ట్ చెబుతూ చక్కటి కుటుంబ కథా చిత్రంగా సినిమాను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతీ టీం మెంబర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
Baby Movie: బేబీ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. నోరు మూసుకుంటానంటూ డైరెక్టర్ ట్వీట్!
వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక రైటర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వస్తుందో లేదో గానీ.. పాషన్ ఇన్వెస్ట్ మాత్రం పదింతల డబ్బు, పేరు తిరిగి వస్తుందని, దానికి తానే ఉదాహరణ అని అన్నారు. జయం సినిమాలో సదా, నితిన్‌లా విస్మయ, రిష్విలు కనిపిస్తున్నారని పేర్కొన్న ఆయన ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. వరికుప్పల గారు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ అండర్ రేటెడ్ లిరిక్ రైటర్ అని ఆయన ఈ సినిమాకు పాటలు అందించారని అన్నారు. ఆగస్ట్ 4న ఈ సినిమా రాబోతోందని పేర్కొన్న ఆయన దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ సాయంతో సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుందని అన్నారు.