Site icon NTV Telugu

Krishna Gadu Ante Oka Range: సినిమా రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయం అనిపిస్తోంది!

Producer Comments

Producer Comments

Krishna Gadu Ante Oka Range Movie Producer Crucial Comments: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ సినిమా ఆగ‌స్ట్ 4న రిలీజ్ అవుతోంది. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను రాజేష్ దొండపాటి తెరకెక్కించారు. ఇక ఈ క్రమంలో నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి మీడియాతో ముచ్చటిస్తూ సినిమాకి సంబందించిన పలు ఆ విశేషాలను పంచుకున్నారు. తాను ఉద్యోగరీత్యా సాఫ్ట్ వేర్ అయినా కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టమని, ఆరేళ్ల క్రితం సినిమాల మీద ఓ ఆలోచన పుట్టిందని అన్నారు.. ఎప్పుడూ మనం సినిమాలను చూడటమేనా? మనం ఎందుకు తీయలేమని నాలో ఆలోచన పుట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని అన్నారు. తన స్నేహితుడు ఒకరు కథలు రాస్తుండేవాడని, ఎన్నో సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గానూ పని చేసిన ఆయన వల్ల సినిమాల గురించి ఆలోచిస్తూ ఉండగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను పరిచయం చేశాడని ఆయనే మా సినిమా డైరెక్టర్ రాజేష్ దొండపాటి అని చెప్పుకొచ్చారు.

Baby: బేబీ కోసం కదిలొస్తున్న మెగాస్టార్!

నిర్మాత‌గా ఓ కుటుంబంతో క‌లిసి అంద‌రూ చూసి ఎంజాయ్ చేసేలా ఓ సినిమా తీయాల‌నుకున్నానని, నాకున్న ఆలోచనలే మా దర్శకుడుకి ఉండడంతో మా ఇద్దరి ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. తెలుగులో సినిమా తీయడం కష్టమని అంటుంటారు కానీ నాకు అలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదని అని తాను మొత్తం యూఎస్‌లోనే ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడ మ్యానేజ్ చేసే వాళ్లని, అనుభవం లేకపోవడంతో కాస్త బడ్జెట్ అదుపు తప్పిందని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో దిల్ రాజు, అరవింద్, రామానాయుడు అంత ఎదగాలని అనుకుంటున్నానని పేర్కొన్న ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి క్రియేటివ్ వ్యక్తుల వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని వారే తనకు స్ఫూర్తి అని అన్నారు. తమ సినిమా విడుదల విషయంలో దిల్ రాజు గారు, బెక్కెం వేణుగోపాల్ సాయం చేస్తున్నారని, మూవీని రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయంగా అనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

Exit mobile version