Site icon NTV Telugu

Drohi: ఆసక్తి రేపుతున్న ‘ద్రోహి’ మూవీ ఫస్ట్‌ లుక్‌

Drohi The Crimnal

Drohi The Crimnal

Krish launches the title and poster of Drohi: సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా ‘ద్రోహి’ (ది క్రిమినల్‌ అన్నది ట్యాగ్ లైన్) అనే సినిమా తెరకెక్కుతోంది. గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌ సంస్థలపై శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్‌ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూట్, పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రిష్‌ మాట్లాడుతూ ‘‘సినిమాకు సంబంధించిన లుక్‌, గ్లింప్స్‌ చూశాను, చాలా ప్రామిసింగ్‌గా ఉందని అన్నారు.

టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో పని చేశారన్న ఆయన ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఇక వారంతా సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఇక దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న మా ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని అన్నారు.ఇదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’ అని వారు వెల్లడించారు. డెబి, షకలక శంకర్‌, నిరోజ్‌, శివ, మహేష్‌ విట్ట, మెహ్బూబ్‌, చాందినీ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి అనంత్‌ నారాయణ సంగీతం అందించారు.

Exit mobile version