Site icon NTV Telugu

Kota Srinivas : కోట శ్రీనివాసరావుకు ఏమైంది.. ఇలా మారిపోయాడేంటి..

Kota Srinivasarao

Kota Srinivasarao

Kota Srinivas : సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు చాలా కాలంగా కెమెరా ముందుకు రావట్లేదు. వయసు పైబడటంతో ఇంటికే పరిమితం అయిన ఆయన.. ఎలా ఉన్నారో చాలా మందికి ఇన్నేళ్లు తెలియలేదు. తాజాగా బండ్ల గణేశ్ కోట ఇంటికి వెళ్లి పరామర్శించిన ఫొటోలు ఇప్పుడు బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు. కోట శ్రీనివాస రావు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నట్టు కనిపిస్తోంది. ఆయన కాళ్లు నల్లగా మారిపోయాయి. చూస్తుంటే కుడి కాలు బొటనవేలు తీసేసినట్టున్నారు డాక్టర్లు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్టు కనిపిస్తోంది.

Read Also : Ram Charan : రామ్ చరణ్‌ తో త్రివిక్రమ్ మూవీ అప్పుడేనట..

కాళ్లకు బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తున్నాడు. చాలా సన్నబడిపోయాడు. చేతులకు కూడా పుండ్లు కనిపిస్తున్నాయి.వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన కోట ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా దాదాపు అందరు హీరోలతో, డైరెక్టర్లతో పనిచేసిన అనుభవం ఆయనది. మూడు తరాల హీరోలతో కలిసి పనిచేశారు.

ఈ రోజు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కనిపించడం అందరినీ కలిచి వేస్తోంది. డెబ్బై ఏళ్లకు పైగా వయసున్న కోట.. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ ట్రీట్ మెంట్స్ తీసుకుంటున్నాడు. మలిదశ వయసులో ఆయన ఇలా ఇబ్బందులు పడటం కలచివేస్తోందని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.

Read Also : Ram Charan : రామ్ చరణ్‌ తో త్రివిక్రమ్ మూవీ అప్పుడేనట..

Exit mobile version