ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కొరటాల శివ “పుష్ప” చిత్రం గురించి, అలాగే సుకుమార్ గురించి మాట్లాడారు. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. అలాగే సుకుమార్ ఇక్కడ లేడు కాబట్టి ఆయన తరపున నేను మాట్లాడుతున్నాను అంటూ నిర్మాతలతో పాటు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక “పుష్ప: ది రైజ్” హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై, సినిమా కోసం ఆయన పడుతున్న శ్రమను ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also : వీడియో : “ఎఫ్3” ఫన్ స్టార్ట్… స్పెషల్ లుక్ లో వెంకటేష్
“అల్లు అర్జున్ తన కఠోర శ్రమతో కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకున్నాడు. అంకితభావం, కష్టపడే స్వభావం విషయంలో అల్లు అర్జున్‌కి ఏ భారతీయ నటుడూ సరిపోడు. ఆయన సినిమా కోసం పెట్టే డెడికేషన్ ను చూస్తుంటే ఆయనలోని నీకోసం ఎలాంటి కథలు రాయాలో మాకు కూడా అర్థమవుతోంది. ఖచ్చితంగా ‘పుష్ప’ కంటే పెద్ద కథతో నీ దగ్గరకు వస్తా… నీలాంటి నటుడిని ఏ రేంజ్ లో చూపించొచ్చు అనేది బాగా ఆలోచించుకుని, స్క్రిప్ట్ రెడీ చేసుకుని ‘పుష్ప’ తరువాత నిన్ను సంప్రదిస్తా’’ అని కొరటాల అన్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది అనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసినట్టే. “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న థియేటర్లలోకి వస్తోంది.
