Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్‌ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!

Korean Kanakaraju3

Korean Kanakaraju3

Korean Kanakaraju Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్నే అందుకుంటోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే మొదలైన పాజిటివ్ టాక్ తో క్రమంగా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా కేవలం మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటి ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లింది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా, రితికా నాయక్ కథానాయికగా కనిపించారు. సత్య, మురళీధర్ గౌడ్, చిన్న, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి స్పందన లభించింది. అయితే రెండో రోజు నుంచి కలెక్షన్లలో మెరుగుదల కనిపించడంతో చిత్రబృందం కూడా ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం, ఆదివారం కలెక్షన్లు పెరగడంతో తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. సినిమా బాక్సాఫీస్ విజయంలో పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన క్రమంగా ఇతర ప్రేక్షకులకు చేరడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగింది. సాధారణంగా తొలి వారాంతం తర్వాత సోమవారం వసూళ్లలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. కానీ ‘కొరియన్ కనకరాజు’ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉండటంతో సోమవారం కూడా మంచి రన్ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో సోమవారం బోనాల పండుగ సెలవు కూడా సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటంతో సెలవు రోజున మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన సినిమాకు లాంగ్ రన్ అవకాశాలను పెంచుతోంది. ‘కొరియన్ కనకరాజు’లో హారర్ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అంశాల్లో ఒకటిగా మారింది. వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను పెంచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భయపెట్టే సన్నివేశాలతో పాటు లైట్ హార్టెడ్ కామెడీని మిక్స్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే 500 వేల డాలర్ల మైలురాయికి చేరువలో ఉంది. ప్రస్తుత ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే, వన్ మిలియన్ డాలర్ల మార్క్ ను దాటే  అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ మంచి హిట్ కొట్టాడు. సినిమా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడం, పాజిటివ్ మౌత్ టాక్ పెరగడం, వీకెండ్ కలెక్షన్లు బలంగా ఉండటం వంటి అంశాలు ఈ విజయానికి కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా పెట్టుబడిని రికవర్ చేసే దశను దాటి లాభాల బాటలోకి వెళ్లింది ఈ మూవీ. ఇక ముందున్న రోజులు సినిమాకు కీలకం కానున్నాయి. సోమవారం సెలవు, అడ్వాన్స్ బుకింగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్ స్పందన కలిసి వస్తే ‘కొరియన్ కనకరాజు’ లాంగ్ రన్ సాధించే అవకాశం ఉంది.