Site icon NTV Telugu

Koratala Shiva: ఈ సినిమాతో నాకు ఒక ‘ఆచార్య’ దొరికారు

Koratala

Koratala

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  హీరోలుగా నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ ” నాలుగేళ్ళ తరువాత నాకు మైక్ పట్టుకొని మాట్లాడే అవకాశం వచ్చింది. చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన షూటింగ్ చూడాలి అనుకున్న నాకు ఆయనకే కట్, యాక్షన్ చెప్పే అవకాశం కల్పించి ఒక అద్భుతమైన ప్రయాణంగా నాకు మిగిల్చిన మెగాస్టార్ గారికి థాంక్స్.. ఇది ఎప్పటికి గుర్తిండిపోతుంది. నాకు ఈ సినిమా జర్నీ లో మెగాస్టార్ ఎంత గొప్ప వ్యక్తో తెలుసుకుంది.

నిజంగా ఈ నాలుగేళ్ళ సమయం  అది నాకు ఒక నిధి లాంటింది.. నా జీవితం మొత్తం దీన్ని గుర్తుపెట్టుకున్నాను.   సినిమాకు ఆచార్య అని టైటిల్ పెట్టాను.. అందుకు తగ్గట్టే నాకు చిరు లాంటి ఆచార్య దొరికారు. నాలుగేళ్లు ఈ సినిమా కోసం పనిచేసిన నా టీమ్ కి థాంక్స్ చెప్పాలి. ఇప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో పని చేస్తూనే ఉన్నారు. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు థాంక్స్.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారికి థాంక్స్. మంచి పాటలు ఇచ్చారు. ఇక చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాలి.. కథ చెప్తుంటే నిర్మాత కాబట్టి చెప్పడానికి వచ్చాను అనుకున్నారు. కానీ మీరు కూడా చేయాలి అంటే అదేదో ఫెవర్ లా కాకుండా ఫీల్ అవ్వకుండా నాకు నచ్చి చేస్తున్నాను.. ముఖ్యంగా నాన్న గారితో చేసే అవకాశం ఇచ్చారు అని చెప్పారు. ఏప్రిల్ 29 సినిమా రిలీజ్ అవుతుంది.. నాలుగేళ్ళ కష్టం యూ మీరు చూసి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.

Acharya Pre Release Event LIVE | Chiranjeevi | Ram Charan | Koratala Siva | NTV Ent LIVE

 

Exit mobile version