యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయ్యింది. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో ‘భైరవుడు’ అనే పాత్రలో నటిస్తున్న సైఫ్ అలా వచ్చాడో లేదో కొరటాల శివ, హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక కొండ పైన జాతర సెటప్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ మధ్య యాక్షన్ సీన్స్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. సైఫ్ అండ్ ఎన్టీఆర్ మంచి పెర్ఫర్మార్స్ కావడంతో ఈ ఇద్దరి మధ్య పోటాపోటీగా సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సైఫ్, ఎన్టీఆర్ తో పాటు శ్రీకాంత్ కూడా ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్నాడట.
Read Also: The OG: ఇదెక్కడి ‘మాస్’ జోష్ బ్రో… OG కోసం ఏకంగా బిర్యానీలు పంపిస్తున్నావ్
శంషాబాద్ లో కొరటాల శివ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేశాడు, ఇప్పుడు RFCలో కూడా యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే సముద్ర వీరుడు vs భారవుడు మధ్య బిగ్గెస్ట్ వార్ జరిగేలా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ‘ఎన్టీఆర్ 30’ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తూ రోజురోజుకీ మరింత హైప్ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఒక డైలాగ్ వైరల్ అవుతోంది. “సమయం యుద్ధాన్ని కోరినప్పుడు… ప్రకృతి తన సారధిని పంపిస్తుంది.. ప్రకృతి కోరలకు బలిచ్చే ధీరుని ప్రచండ దాడికి సిద్ధం” అనే డైలాగ్ ని ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ డైలాగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో, సినిమాలో ఉందో లేదో తెలియదు కానీ డైలాగ్ లో విషయం ఉండడంతో ఫాన్స్ ఈ డైలాగ్ ని ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు.
