NTV Telugu Site icon

NTR: దేవర కోసం గుజరాతీ బ్యూటీని దించుతున్న కొరటాల శివ…

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ‘దేవర’ మూవీ రాబోతోంది. అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం దేవర షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కొరటాల… అనుకోకుండా షూటింగ్‌లో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అవడంతో… ఏప్రిల్ 5 నుంచి దేవర పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అతి త్వరలోనే కొరటాల దీనిపై క్లారిటీ ఇవ్వనున్నాడు. ఇక… దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇస్తోంది అమ్మడు. దేవర సరసన తంగం అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఇదిలా ఉంటే… దేవర సినిమాలో జాన్వీ మించిన మరో హీరోయిన్ కూడా నటిస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మరో కీలక పాత్ర కోసం మరాఠీ బ్యూటీని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

గుజరాతి నటి, ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్టనేకర్ భార్య శృతి మరాఠే… దేవరలో కీ రోల్ కోసం ఫైనల్ చేశారట. అంతేకాదు… ఆమెకి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా దేవర యూనిట్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా… శృతి మరాఠే గురించి ఆరా తీస్తున్నారు. అమ్మడిని చూసిన తర్వాత జాన్వీకపూర్ కన్నా బాగుందంటూ… కామెంట్స్ చేస్తున్నారు. అయితే… దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో తారక్ ఫాదర్ క్యారెక్టర్‌కు జోడీగా శృతి నటిస్తుందా? లేదంటే, మరేదైనా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఈ ముద్దుగుమ్మ ఎంట్రీతో… దేవర మరింత కలర్ ఫుల్‌గా మారిందనే చెప్పాలి.

Show comments