రాజకీయ నాయకులు కొండా మురళి, కొండా సురేఖపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “కొండా” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘కొండా’ ట్రైలర్ ఆర్జీవీ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యింది. తైలం లో కొండా మురళి ఎంట్రీ కోసం ‘ఎక్స్ట్రీమ్ పీపుల్ ఎమర్జ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ సిట్యుయేషన్’ అనే కార్ల్ మాక్స్ కోట్‌ను కూడా ఉదహరించాడు.
Read Also : హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్
‘కొండా’ మూవీ 1970ల చివరలో, 1980ల ప్రారంభంలో వరంగల్ నేపథ్యంలో ఉంటుంది. కొండా మురళి పాత్రలో యంగ్ హీరో త్రిగుణ్ నటించగా, నాగ్ ‘ఆఫీసర్’ ఫేమ్ ఇర్రా మోర్ కొండా సురేఖగా నటించారు. మురళి, సురేఖ కాలేజీ మేట్స్‌గా కనిపిస్తారు. చివరికి ప్రేమలో పడతారు. కానీ మురళి మావోయిస్టుల (నక్సల్) ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యి, తిరుగుబాటు బృందంలో చేరాడు. ఇక్కడి నుంచి మురళి ఇప్పుడున్న స్థాయికి ఎలా ఎదిగాడు? రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టాడనేది కథాంశం. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.