Kona Venkat Donates 50,000 to Geetanjali Children: సోషల్ మీడియా ట్రోలింగ్స్ వలన మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్న తెనాలికి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. ఈ సందర్భంగా గీతాంజలి పిల్లలను చూసి చలించిపోయిన సినీ రచయిత కోన వెంకట్ .. వారికి 50 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఇక ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని తన సొంత కుమార్తెల్లా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్‌తో చంపేశారని ఇదే సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినే అని ఆయన అన్నారు.
Barrelakka: కాబోయే భర్తతో వీడియో వదిలిన బర్రెలక్క.. ఎవరో, ఎలా ఉన్నాడో చూశారా?
అందుకే ఈ తరహా వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అందుకు ఇలాంటి వేధింపులను అరికట్టడానికి వీలైతే కొత్త చట్టాలు తేవాలని అన్నారు. తెలుగులో టాప్ రైటర్ గా కొనసాగుతున్న కోన వెంకట్ ప్రస్తుతానికి గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంజలి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడిగా కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. గతంలో అంజలి హీరోయిన్ గా తెరకెక్కిన గీతాంజలి అనే సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తారని ఎవరూ ఊహించలేదు కానీ కొన్నాళ్ల క్రితం సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.
