Site icon NTV Telugu

RRR: ప్రతి ఒక్కరి గుండెలను పిండేసిన పాట.. కొమ్మ ఉయ్యాలా వీడియో రిలీజ్

Rrr

Rrr

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతనెల విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని కొమ్మ ఉయ్యాలా .. కోన జంపాలా సాంగ్ ఎంతటి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో నటించిన మల్లిని ఓవర్ నైట్ స్టార్ కిడ్ గా మార్చేసింది.ఇక సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే ఈ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎంతో అందమైన గాత్రంతో.. బ్రిటిష్ దొరసానికి గోరింటాకు పెడుతూ కొమ్మ ఉయ్యాల్లో.. కోన జంపాల్లో అంటూ పాడుతోంది మల్లి.

చిన్నారి వాయిస్, గోరింటాకు నచ్చి.. బ్రిటిష్ దొరసాని ఆమెను తీసుకువెళ్లిపోతుంది.. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారి ఆ బ్రిటిష్ దొరసాని ఇంట్లో బందీలా.. పంజరంలో చిలుకలా తన తల్లిని తలుచుకొని, తన బాధను వెళ్లగక్కుతూ పాడుతుంటే.. ప్రతి ఒక్కరి మనసు చలించక మానదు. ఇక మల్లి కోసం కొమరం భీముడు రంగంలోకి దిగి కూతురు కోసం ఆరాటపడుతున్న తల్లిని.. తల్లి కోసం ఎదురుచూస్తున్న చిన్నారిని ఒక్కటి చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటాడు. వీడియోలో వీటన్నింటిని చూపించడం హైలైట్.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి ఎంతో అద్భుతంగా ఆలపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియో సాంగ్స్ కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.. మరి ఈ పాట ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=eWdEqcIH-Xw

Exit mobile version