NTV Telugu Site icon

Karthi: త్వరలో ఆ హిట్ సినిమాకి సీక్వెల్… అఫీషియల్ గా అనౌన్స్ చేసిన కార్తీ

Karthi

Karthi

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తన హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసాడు. కార్తీ నుంచి సీక్వెల్ వస్తుంది అనగానే ఆడియన్స్ మైండ్ ఖైదీ 2 గురించి ఆలోచిస్తుంది. ఖైదీ 2 రావాలంటే టైమ్ పడుతుంది. లోకేష్ కనగరాజ్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న తలైవర్ 171 సినిమా అయిపోయిన తర్వాతే ఖైదీ 2 స్టార్ట్ అవనుంది. అప్పటివరకూ కార్తీ నుంచి ఖైదీ 2 బయటకి రాదు. ఈ లోపు మరో హిట్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసాడు కార్తీ. పీఎస్ మిత్రన్ డైరెక్షన్ లో కార్తీ నటించిన సినిమా సర్దార్. ఇండియన్ స్పై సర్దార్ పాత్రలో కార్తీ నటించిన విధానం, కథ-కథనం సాగిన విధానం ఆడియన్స్ ని విపరీతంగా మెప్పించాయి.

Read Also: Tiger 3: ‘లేకే ప్రభు కా నామ్..’ పాట‌లో 7 అద్భుత‌మైన లుక్స్‌తో మెస్మ‌రైజ్ చేయ‌నున్న క‌త్రినా

ఖైదీ రేంజులో హిట్ అవ్వలేదు కానీ సర్దార్ కూడా మంచి విజయాన్నే సాధించింది. పార్ట్ 1లో సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసిన సర్దార్… ఎండ్ సీన్ లో సడన్ గా మాయం అవుతాడు. ఇక్కడి నుంచి సీక్వెల్ స్టార్ట్ అయ్యి, కొత్త సోషల్ కాజ్ కోసం సర్దార్ ఫైట్ చేస్తాడు. సర్దార్ సినిమా రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయిన సంధర్భంగా కార్తీ… ట్వీట్ చేసి త్వరలో సర్దార్ 2 రాబోతుంది అనే కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. కాంబోడియా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. మరి ఈసారి మిత్రన్-కార్తీ కలిసి ఏ మాఫియాను రంగంలోకి దింపుతారో చూడాలి.

Read Also: Leo: రెండో రోజు వంద కోట్ల డ్రాప్… మండేకి పరిస్థితి ఏంటి?