NTV Telugu Site icon

Koffe With Karan: చివరిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నావ్.. విజయ్ దేవరకొండ బోల్డ్ ఆన్సర్

Karan Johar

Karan Johar

Koffe With Karan: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’. ఫేమస్ సెలబ్రిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకొని 7 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ లో ముందు ఎన్నడూ లేని విధంగా తెలుగు తారలు సందడి చేయడం విశేషం. ఇప్పటికే ఈ షో లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఇక నాలుగో ఎపిసోడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే సందడి చేశారు. ఈ జంట లైగర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తోంది. మొదటి నుంచి కరణ్ ఈ షో లో బోల్డ్ ప్రశ్నలతో తారలను ముప్పుతిప్పలు పెడుతుంటాడు అన్న విషయం విదితమే. ఈ ఎపిసోడ్ లో కూడా విజయ్ ను అదేవిధంగా ఆడుకున్నాడని తెలుస్తోంది. గాసిపీస్, తారల శృంగారపు అలవాట్లు ను నిర్మొహమాటంగా అడిగే కరణ్ .. విజయ్ ను చివరిగా శృంగారం ఎప్పుడు చేసావ్ అని అడిగేశాడు. దీనికి విజయ్ అన్సార్ చెప్పేలోగా అనన్య అందుకొని నాకు తెలిసి ఈరోజు ఉదయం అంటూ బోల్డ్ గా చెప్పుకొచ్చింది.

ఇక బాలీవుడ్ భామలు సారా, జాన్వీ.. విజయ్ గురించి మాట్లాడిన వీడియోను చూపించి నిజంగా నీకు చీజ్ అంటే ఇష్టమా..? అని అడిగాడు. దానికి విజయ్.. ఈ విషయం గురించి ఏది మాట్లాడితే ఏమవుతుందో అని భయపడుతున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక కరణ్ ఇంకొంచెం ముందుకు వెళ్లి.. శృంగారం గురించి మాట్లాడుతూ.. ఎప్పుడైనా కారులో చేసావా..? ముగ్గురితో చేయడం ఇష్టమేనా..? అంటూ బోల్డ్ ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. ఇక వాటికి రౌడీ హీరో అంటే బోల్డ్ గా.. కారులో అనగానే కారులో ఇబ్బందిగా అనిపించలేదా..? అని అడగ్గా.. డెస్పరేట్ టైమ్ లో ఇలాంటి పనులు చేయక తప్పదు అంటూ బోల్డ్ ఆన్సర్ ఇవ్వడం షాకింగ్ గా మారింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమోతో ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.