Site icon NTV Telugu

KL Rahul: నా భర్తను అనడానికి మీరెవరు.. అడల్ట్ క్లబ్ ఫొటోపై రాహుల్ భార్య ఫైర్

Rahul

Rahul

KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గురించి ప్రతేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఐపీఎల్ లో గాయపడి బయటికి వచ్చేశాడు రాహుల్. రాహుల్ కుడి తొడపై తీవ్రమైన గాయం కావడంతో తాను ఈ గేమ్ కు అన్ ఫిట్ ను తనకు తానే ప్రకటించుకొని బయటకు వచ్చేశాడు. ఇక గాయం తరువాత రాహుల్ తన కుడి తొడకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఇంగ్లాండ్ కాకుండా లండన్ వెళ్లాడని, ఒక అడల్ట్ క్లబ్ లో ఫోటోలకు ఫోజులిచ్చాడని వార్తలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ కోసం కాకుండా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా రాహుల్ భార్య అతియా శెట్టి కూడా పక్కనే ఉందని కొందరు.. ఆమె లేకుండా ఇలాంటి క్లబ్ కు వెళ్లడమేంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు.

Naveen Ul Haq: సారీ ట్వీట్‌పై నవీన్ రియాక్షన్.. రిపోర్ట్ చేయమంటూ సూచన

ఇక ఈ ట్రోలింగ్ పై అతియా సీరియస్ అయ్యింది. తన భర్త గురించి తనకు అన్ని తెలుసనీ, అసలు అడగడానికి మీరెవరని ప్రశ్నించింది. ” రాహుల్ వెళ్ళింది అడల్ట్ క్లబ్ కు కాదు. అది ఒక నైట్ క్లబ్ మాత్రమే. ఒక ఆటగాడిగా మీరు అతన్ని ఎంత ప్రేమిస్తున్నారో.. అంతకన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను.. ఇష్టపడుతున్నాను. ఒక వ్యక్తిగా అతనికి వేరే జీవితం ఉండవద్దా.. అతనికి నచ్చిన జీవితాన్ని గడపవద్దా.. ?. రాహుల్.. చట్టానికి లోబడే పనులు చేస్తుంటే.. అడగడానికి మనమెవరు..? ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ క్లబ్ లో రాహుల్ తోనే అతియా ఉన్న వీడియో చక్కర్లు కొడుతోంది. దీంతో భార్యతో పాటు వెళ్తే అడగడానికి నిజంగా మీరెవరు అని నెటిజన్స్.. ట్రోలర్స్ పై కౌంటర్లు వేస్తున్నారు.

Exit mobile version