Kireeti Reddy: ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది. చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ వీడియోలో కిరిటీ ప్రదర్శించిన నట నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నారు.
ఇందులో ఎక్స్ ట్రార్డినరీ గా కనిపించారు కిరిటీ. సెప్టెంబర్ 30 శుక్రవారం కిరిటీ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, అతనికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి, భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. కిరిటీ రెడ్డి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌తో తనదైన ముద్ర వేశారు. కాలేజీలో గోడకు ఆనుకుని ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ కోసం ప్లజంట్ బీజీఎం స్కోర్ చేశారు.
Read ALso: RRR: జపాన్ లో జయకేతనం ఎగరేయబోతున్న రామ్ అండ్ భీమ్!
ఈ సందర్భంగా నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ, ”టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అందరినీ ఆకర్షిస్తోంది.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మా సంస్థ నుండి ప్రొడక్షన్ నంబర్ 15 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు” అని చెప్పారు. ఈ చిత్రానికి ‘బాహుబలి’ లెన్స్‌మెన్ కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా, భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
