Aamir Khan:బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురిఞ్చి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నటించకపోయినా.. ఆయనకు టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో మంచి చిత్రాలను తీసి మెప్పించిన అమీర్.. ప్రస్తుత రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, ఎఫైర్స్ గురించి కూడా అందరికి తెల్సిందే. మొదట రీనా గుప్తాను వివాహమాడిన అమీర్.. ఆమెకు విడాకులు ఇచ్చి కిరణ్ రావును వివాహమాడాడు. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో గత కొన్నేళ్ల క్రితం వీరు కూడా కూడా విడిపోయారు. అయితే.. విడాకులు తీసుకున్నా కూడా వీరందరూ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక అప్పట్లో కిరణ్ రావును అమీర్ వివాహం చేసుకున్నప్పుడు.. ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రీనా ఉన్నప్పుడే.. అమీర్, కిరణ్ రావు ప్రేమలో ఉన్నారని, ఆమెతో రొమాన్స్ చేయడం వలనే రీనా విడాకులు ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై కిరణ్ రావు స్పందించింది. ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” రీనా విడాకులు ఇవ్వడానికి కారణం నేను అని అనుకుంటున్నారు. కానీ, రీనాతో అమీర్ విడిపోయినా రెండేళ్లకు మా బంధం మొదలయ్యింది. లగాన్ సినిమాకు అసిస్టెంట్ గా నేను చేసినా కూడా అమీర్ తో మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు సంవత్సరాల తరువాత మేము సన్నహితంగా ఉండడం మొదలుపెట్టాం. అంటే అప్పటికే రీనాకు, అమీర్ కు విడాకులు అయ్యి రెండేళ్లు అయ్యింది. లగాన్ సినిమా షూటింగ్ సమయంలోనే మా మధ్య ప్రేమ చిగురించిందని, నాతో రొమాన్స్ చేయడం వలన రీనా విడాకులు ఇచ్చింది అనేది పచ్చి అబద్దం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.