Site icon NTV Telugu

Vinaro Bhagyamu Vishnu Katha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టీజర్ వచ్చేస్తోంది…

Kiran Abbavaram

Kiran Abbavaram

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇటివలే ‘వాసువ సుహాస’ అనే ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చాలా క్లాసికల్ ట్యూన్ ఇచ్చి ‘వాసువ సుహాస’ సాంగ్ ని స్పెషల్ గా మార్చాడు. ఈ సాంగ్ ఇచ్చిన జోష్ లో మేకర్స్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమా టీజర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. జనవరి 10న ఉదయం 10:15 నిమిషాలకి వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ముందుగా అనౌన్స్ చేసిన డేట్ ప్రకారం అయితే వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ ఈరోజే రిలీజ్ కావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వలన జనవరి 10కి వాయిదా పడింది. ఈ టీజర్ లాంచ్ కోసం ‘పీవీఆర్ ఆర్కే సినీ ప్లెక్స్ స్క్రీన్ 2’ కోసం ఈవెంట్ చెయ్యనున్నారు. రేపు ఉదయం 9:30కి జరగనున్న ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొననున్నారు.

Read Also: Shakuntalam Trailer: అవమానాన్ని ఏ ప్రేమ మరిపించలేదు…

ఇదిలా ఉంటే హీరో కిరణ్ అబ్బవరంకి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 2022లో కిరణ్ అబ్బవరం మూడు సినిమాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. లాస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు పోయిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం తన మార్కెట్ కాపాడుకోవాలి అంటే ‘వినరో భాగ్యమి విష్ణు కథ’ సినిమాతో పక్కా హిట్ కొట్టాల్సిందే. లేదంటే అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులు కిరణ్ అబ్బవరాన్ని ఆడియన్స్ మరిచిపోయే ప్రమాదం ఉంది.

Exit mobile version