Site icon NTV Telugu

KA 11 : ‘కిరణ్ అబ్బవరం ‘KRAMP’ ఫస్ట్ లుక్ రిలీజ్

K Ramp

K Ramp

“క” సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం. కానీ ఆ వెంటనే చేసిన దిల్ రుబా కిరణ్ అబ్బవరం కు చేదు అనుభవాన్ని ఇచ్చింది. అయినా సరే నిరాశ చెందకుండా కాస్త గ్యాప్ తీసుకుని ఈ సారి పవర్ఫుల్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. అలా జైన్స్ నాని అనే నూతన దర్శకుడితో సినిమా చేస్తునాడు కిరణ్ అబ్బవరం.

Also Read : HHVM : యానిమల్ చూసి బాబీ డియోల్ క్యారెక్టర్ మార్చేశా : దర్శకుడు జ్యోతికృష్ణ

తన కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న ఈ  చిత్రంతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమాకు ‘K’ RAMP అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. కాగా నేడు ‘కే ర్యాంప్’ లో కిరణ్ అబ్బవరం కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.  లుంగీ కట్టుకుని బ్యాగ్రవుండ్ లో బీర్ సీసాలతో లవ్ సింబల్ ను జత చేస్తూ సూపర్ లుక్ లో కిరణ్ అబ్బవరం ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా రానున్న ఈ సినిమను కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై నిర్మించనున్నారు నిర్మాత రాజేష్ దండా. జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్స లో విడుదల కానుంది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరోసారి సుపర్ హిట్ కొడతాడని ధీమాగా ఉన్నాడు.

Exit mobile version