NTV Telugu Site icon

Kiran Abbavaram : హీరోను మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు.. ఒక్క శుక్రవారం చాలు !

Kiran Abbavaram

Kiran Abbavaram

కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో “క” సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోన్న నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మా “క” సక్సెస్ మీట్ కు వచ్చి బ్లెస్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్స్. మా మూవీకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు.

Vijay Devarakonda: మెట్ల మీద నుంచీ జారి కింద పడ్డ విజయ్ దేవరకొండ!

నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను. క రిలీజ్ కు ముందు నెగిటివ్ గా మాట్లాడిన వారు 99 పర్సెంట్ ఉండేవారు. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. క టీమ్ అందరికీ మూవీ సక్సెస్ క్రెడిట్ ఇస్తాను. సక్సెస్ ఫెయిల్యూర్స్ నా ఒంటికి పట్టవేమో, అందుకే ఫెయిల్యూర్, సక్సెస్ కు ఒకేలా రియాక్ట్ అవుతున్నాను. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలా ఆ నెంబర్స్ మారిపోవడానికి. మా మూవీని ఆదరిస్తున్న వాళ్లను పర్సనల్ గా వచ్చి కలుస్తాను. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను అన్నారు.

Show comments