Site icon NTV Telugu

Kiara Abbavaram : నా పై సింపతీ వద్దు.. కంటెంట్ నచ్చితేనే రండి..

Kiranabavaram

Kiranabavaram

టాలీవుడ్‌ వద్ద ఉన్న యంగ్ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అనతి కాలంలోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఆయనకు మంచి ఫాలోయింగ్‌ కూడా ఉంది. అయితే కెరీర్‌లో తొందరగా నెగిటివిటీని కూడా ఎదుర్కొన్న హీరోల్లో కిరణ్‌ ఒకరని చెప్పాలి. కొన్నిసార్లు విమర్శలు, కొన్నిసార్లు ట్రోల్స్ ఇవన్నీ చూసినప్పటికీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. అయితే

Also Read : Sreeleela : ఏజెంట్ మిర్చిగా మారిన శ్రీ లీల – నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్!

ఇటీవల కిరణ్‌ అబ్బవరం ఓ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ, తనపై చూపించే సింపతీకి తాను నో చెప్పేశాడు. “నా సినిమాలు చూసి మీకు నచ్చితే రండి, కంటెంట్‌ బాగుంటే సపోర్ట్‌ చేయండి. కానీ నాపై సింపతీతో సినిమా చూడకండి” అని స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. తనపై వచ్చిన నెగిటివ్‌ కామెంట్స్‌ను ఎప్పుడూ తేలికగా తీసుకునే కిరణ్‌, ఇప్పుడు మాత్రం వాటిని పాజిటివ్‌గా మార్చుకున్నాడు. “విమర్శలు నాకు కొత్త దారిని చూపించాయి, నాకు కావలసిన మార్పు అవే చేశాయి” అని ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో నెటిజన్లు కూడా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతున్న తీరు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన సింపతీ కోరుకోకుండా కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే సంకల్పం చూపించడం.. చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, మరొకటి యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సారి కంటెంట్‌తోనే హిట్‌ సాధించాలని ఆయన ఫోకస్‌ పెట్టాడు. మొత్తానికి, “సింపతీ వద్దు – కంటెంట్‌ ముఖ్యం” అని చెబుతూ కిరణ్‌ అబ్బవరం తనదైన ధైర్యాన్ని చూపించాడు.

Exit mobile version