కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తీస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కార్తిక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ‘రాజావారి రాణిగారు, ఎస్.ఆర్ కళ్యాణమండపం’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటకు చక్కటి స్పందన వచ్చింది.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ ఆడియోను లహరి ద్వారా మార్కెట్ లో విడుదల చేయనున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలోని కిరణ్ అబ్బవరం మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోందని, సినిమా కూడా అలాగే అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
