NTV Telugu Site icon

Kiran Abbavaram: అపరిచితుడుకు అమ్మ మొగుడులా తయారయ్యాడు

Kiran

Kiran

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే వినరో భాగ్యం విష్ణు కథ సినీరంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా విజయంతో జోరు పెంచిన ఈ హీరో తన వరుస సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం కిరణ్ నటించిన మీటర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. రమేష్ కడూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కిరణ్ సరసన కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.

Puri- Charmi: ఏయ్.. ఏయ్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారు

టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలో కిరణ్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. అసలు పోలీస్ జాబ్ అంటేనే ఇష్టం లేని కిరణ్.. ఎస్ఐ గా ఒక ఊర్లో అడుగుపెడతాడు. ఒక నిర్లక్ష్యపు పోలీసాఫీసర్ గా పై అధికారుల చేత కూడా తిట్లు తింటూ ఉంటాడు. ఇంకోపక్క హీరోయిన్ వెంటపడుతూ పక్కా పోకిరి అని అనిపించుకుంటాడు. పోలీస్ అంటే ఇష్టం లేకపోయినా అతడిలో ఉన్న ఇగోను కదిలిస్తే మాత్రం ఎంత దూరమయిన వెళ్తాడు. అలా ఒక పొలిటీషియన్.. కిరణ్ కు మధ్య ఒక గొడవ జరుగుతోంది. ఆ గొడవ ఏంటి..? తన ఇగోను కదిలించిన పొలిటీషియన్ కు పోలీసాఫీసర్ ఎలా బుద్ది చెప్పాడు..? చివరికి పోలీస్ యొక్క పవర్ ను చూపించాడా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ లో కిరణ్ కు మామగా సప్తగిరి కామెడీ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ” బ్లాస్ట్ అవ్వడానికి ఇది పవర్ తో నడిచే మీటర్ అనుకున్నావా.. పొగరుతో నడిచే మాస్ మీటర్.. ఆన్ అవ్వడమే 100 మీద ఉంటుంది.. తొక్కు.. తొక్కు.. తొక్కుకుంటూ పోవడమే” అనే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకొంటుంది. ఇక సాయి కార్తీక్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశాడు డైరెక్టర్. ఏప్రి 7 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరో హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.