NTV Telugu Site icon

Kiran Abbavaram : వరుస ఫెయిల్యూర్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం..

Whatsapp Image 2023 11 21 At 12.13.17 Pm

Whatsapp Image 2023 11 21 At 12.13.17 Pm

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజా వారు రాణి గారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వరుస సినిమాలు చేసాడు. ప్రస్తుతం ఈ హీరో కు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. అతడు హీరో గా నటించిన మీటర్‌, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా తో పాటు రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్స్‌ గా మిగిలాయి.వరుస ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్ అతడి కెరీర్‌పై గట్టిగానే పడింది.ఈ పరాజయాల పై కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మీటర్‌, రూల్స్ రంజన్‌తో పాటు నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాల కోసం రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని ఆయన తెలిపాడు. రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా పద్దతి లోనే తాను సినిమాలు చేస్తున్నట్లు కిరణ్ అబ్బవరం తెలిపాడు..

సెబాస్టియన్ పీఎస్ 524 నుంచే ఈ రూట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలిపాడు.ఒకవేళ ప్రొడ్యూసర్లు నష్టపోతే వారిని ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ అడగనని కిరణ్ అబ్బవరం అన్నాడు. మీటర్‌ మరియు నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిజల్ట్‌ను తాను ముందే ఊహించినట్లు కిరణ్ అబ్బవరం చెప్పాడు. ఒకవేళ తానే ప్రొడ్యూసర్ అయితే ఆ సినిమాల్ని అస్సలు నిర్మించే వాడిని కాదని తెలిపాడు..మీటర్ కథ బాగానే ఉన్నా తన ఇమేజ్‌ కు మించిన ఎలివేషన్స్ వల్ల సినిమా ఫెయిలైంది అని కిరణ్ అబ్బవరం తెలిపాడు… గత సినిమాల ఫలితాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు. కథలు వాటి ఎగ్జిక్యూషన్ విషయం లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలిపాడు..తొందరపడి సినిమాలు చేయడం కాకుండా మంచి కథలను ఎంచుకోవాలని కెరీర్‌ కు ఆరు నెలల పాటు బ్రేక్ తీసుకొంటున్నట్లు పేర్కొన్నాడు..

Show comments