Kiran Abbavaram and Rahasya Gorak engaged today at an intimate gathering in Hyderabad : ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది అని చెప్పొచ్చు. బయట సామాన్యులు మాత్రమే కాదు సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు సైతం పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు హీరోలు పెళ్లి బాట పట్టగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వివాహానికి సిద్ధమయ్యాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కిరణ్ అబ్బవరం తొలుత షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినీ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు చేశాడు. అలా తొలి సినిమాగా రాజావారు రాణి గారు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఇప్పుడు తన తొలి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్ తో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అందులో భాగంగా వీరిద్దరికీ సంబంధించిన ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్ లో అతి సన్నిహితులుగా భావిస్తున్న కొద్ది మంది సమక్షంలో జరిగింది.
Chota K Naidu: పవన్ బట్టల నిండా రక్తం.. అతనిని చేతుల్లో మోసుకుంటూ పరిగెత్తాడు
దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు రాగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతుందని కూడా ప్రచారం. ఇక కిరణ్ అబ్బవరంది ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా. సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి ఎట్టకేలకు హీరోగా మారాడు. ఇక రహస్య గోరక్ విషయానికి వస్తే ఆమె కూడా 2016 వ సంవత్సరంలో హీరోయిన్ గా తెలుగు సినీ రంగ ప్రవేశం కోసం వచ్చింది. హైదరాబాదులో పుట్టి పెరిగిన ఆమె ఆకాశమంత ప్రేమ అనే షార్ట్ ఫిలింతో కెరీర్ మొదలుపెట్టింది 2019లో రాజావారు రాణి గారు సినిమాతో హీరోయిన్ గా మారింది. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివిన ఆమె లక్స్ డ్రీమ్ గోల్డ్ టైటిల్ విన్నర్ కూడా. తెలుగులో ఆ ఒక్క సినిమానే చేసిన ఆమె తమిళ్ లోకి వెళ్లి అక్కడ కూడా ఒక సినిమా చేసింది.