Kiraak RP: నా రేట్లు ఇలానే ఉంటాయి.. తింటే తిను.. లేకపోతే పో.. నేనెవరిని బతిమాలాడను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ గురించి అందులో ఉన్నవారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక కామెడీ షోలు అన్ని పక్కన పెట్టి నెల క్రితమే కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఊహించని విధంగా ఈ కర్రీ పాయింట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడికి వచ్చే జనాన్ని ఆపలేక ఆర్పీ బౌన్సర్లను కూడా పెట్టాడు. దాదాపు లక్షల్లో లాభాలను ఆర్జించడం మొదలుపెట్టాడు ఆర్పీ. నెల్లూరు నుంచి ఫ్రెష్ చేపలను తెచ్చి.. మంచిగా వండుతుండడంతో జనాలు కర్రీ పాయింట్ కు క్యూ కట్టారు. ఇక ఆ తరువాత మొదలయింది అసలు సమస్య. ఇప్పుడు కుమారి ఆంటీ ఎలాగో అప్పుడు ఆర్పీ కూడా అలాగే తన షాప్ ను మూసివేయాల్సి వచ్చింది. అయితే ఆర్పీ మాత్రం చిన్న షాప్ ను పెద్దది గా చేసి షాక్ ఇచ్చాడు. ఇలా హైదరాబాద్ లో మూడు బ్రాంచ్ లను ఓపెన్ చేశాడు. ఇప్పుడు వేరే ఊర్లలో కూడా బ్రాంచ్ లను ఓపెన్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే .. చేపల పులుసు టేస్ట్ ఏమో కానీ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయని చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చిన ఆర్పీ మరోసారి ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు.
” ఇప్పుడు నీ ఎదురు క్రెటా ఉంది.. ఆడీ ఉంది.. బెంజ్ ఉంది.. నీకు ఏది నచ్చితే అది తీసుకో.. నీకేంటి సమస్య.. రూ. 300 చేపలు పెట్టా.. ఆ రూ. 300 పెట్టి జనాలు తీసుకోకపోతే లాస్ అయ్యేది ఎవరు.. నేనే కదా.. ఆశపడి ఎక్కువ రేటు పెడితే.. జనాలు కొనకపోతే నష్టం వచ్చేది కూడా నాకే. తక్కువ రేటు పెట్టొచ్చు అని తెలిసినప్పుడు ఎక్కువ రేటు పెట్టి జనాలు రాకపోతే మోసపోయేది ఎవరు.. నేనే కదా.. అది అంతే రేటు.. తింటే తిను.. లేకపోతే పో. రెస్టారెంట్ లో తినేవాళ్లు తింటారు.. రోడ్డుపక్కన తినేవాళ్లు తింటారు. నేను తక్కువలో చేయాలంటే నాసిరకం తీసుకొచ్చి వండమంటే వండుతా.. అన్నాన్ని, రాగి సంకటిని తక్కువలో ఇవ్వగలను కానీ, కోరమీను లాంటి కోరమీనును తక్కువ రేటులో ఇప్పించండి.. అలాగే తక్కువ రేటుకు ఇస్తా.. నా రేట్లు ఇలానే ఉంటాయి. క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. మీకు ఎలా పడితే అలా నాసిరకంగా వండి పెట్టడం లేదు. చేపల పులుసుకు వాడే అన్ని పదార్దాలు రేటు ఎక్కువ.. చేపలు రేటు ఎక్కువ, ఆయిల్, మసాలాలు ఇవన్నీ రేట్లు ఎక్కువ అన్నప్పుడు నాకేం చిటికేస్తే రావడం లేదు. ఇవన్నీ కావాలని కొంతమంది గ్రూప్ లు చేస్తున్నాయి. నీకు టేస్ట్ నచ్చితేనే కొను.. రసం లా ఉంటుంది అంటే అదే కొనుక్కొని తిను.. నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చకపోయినా నా చేపల పులుసు తీసుకోవాలని నేను బతిమాలాడను” అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
జేబులో 100రూ పెట్టుకొని 1000రూ వస్తువు తీస్కోవాలంటే అవ్వదు.. నా చేపల పులుసు రేట్లు ఇలానే ఉంటాయి.. ఇష్టముంటే తిను లేకపోతే పో..! – Kiraak RP#KiraakRP #FishCurry #ChepalaPulusu #NellorePeddareddyChepalaPulusu #Jabardast #NTVENT #NTVTelugu pic.twitter.com/dbDscryBWQ
— NTV Telugu (@NtvTeluguLive) March 2, 2024
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!