NTV Telugu Site icon

Kalyan Dev: ఓటీటీలో ‘కిన్నెరసాని’!

Kinnrerasani On Ott

Kinnrerasani On Ott

క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో రూపుద్దిద్దుకున్న సినిమా ‘కిన్నెరసాని’. కంటెంట్‌కి పెద్ద పీట వేస్తూ, నిర్మాణ విలువ‌ల్లో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి. ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ తో క‌లిసిఈ చిత్రాన్ని నిర్మించింది. ఇంటెన్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘కిన్నెరసాని’ సినిమాను నిజానికి జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ దానికి ముందు వచ్చిన కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ చిత్రం సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

అప్పటి నుండి ధియేట్రికల్ రిలీజ్ కోసం ప్రయత్నించిన నిర్మాతలు చివరకు జీ 5లో స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యారు. ఈ నెల 10న ‘కిన్నెరసాని’ మూవీ జీ 5లో ప్రసారం కానుంది. గతంలో ‘కల్కి’ చిత్రానికి కథను అందించిన దేశరాజ్ సాయితేజ ఈ చిత్రానికి కథ, కథనం అందించాడు. ‘ఛ‌లో, భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన మ‌హ‌తి స్వర సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.