Site icon NTV Telugu

Kingdom : కింగ్డమ్ ప్రీమియర్స్ క్యాన్సిల్.. కారణం ఇదే

Kingdom

Kingdom

విజయ్ దేవరకొండ  హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ్ సంస్త సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన కింగ్‌డమ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టతానని కాన్ఫడెంట్ గా ఉన్నాడు.

Also Read : AVATAR 3 : జేమ్స్ కామెరూన్ అవతార్ 3 ట్రైలర్ ఇంకా చూడలేదా.. ఇక్కడ చూసేయండి

ఈ నెల 31న కింగ్‌డమ్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందుగా 30న ప్రీమియర్స్ వేసేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. కానీ ఇటీవల వస్తున్న సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్స్ నెగిటివ్ వస్తే అది ఓపెనింగ్ రోజు కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. అది ఒక రకంగా రిస్క్ అని భావించి   ముందు రోజు ప్రీమియర్స్ వేయాలనే ఆలోచనను విరమించుకున్నారట. కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా మరో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 31న రిలీజ్ రోజు తెల్లవారుజామున 5 గంటల ఆట నుండి షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు కింగ్‌డమ్ కు ఎపిలో అదనపు రేట్లు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. హరిహర వీరమల్లు కలెక్షన్స్ డ్రాప్ కావడం పోటీలో మరే సినిమాలు లేకపోవడంతో కింగ్‌డమ్ కు తొలిరోజు భారీ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. జరగాల్సిందల్లా కింగ్‌డమ్ కు హిట్ టాక్ రావడమే.

Exit mobile version