NTV Telugu Site icon

King of Kotha: తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ హిట్ కొట్టాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?

Dulquer Salmaan Speech

Dulquer Salmaan Speech

King of Kotha Telugu States Pre Release Business: సీతారామం సినిమాతో అమ్మాయిల రాకుమారుడిలా మారిన దుల్కర్ సల్మాన్… ఇప్పుడు మాస్ అండ్ యాక్షన్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కొత్త. ఇక ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఓ ఊపు ఊపేస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్ కూడా ప్రమోషన్స్ ఓ రేంజులోనే చేస్తున్నారు. అయితే అన్ని భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దుల్కర్.. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ కొట్టేందుకు ప్లాన్ వేశారు. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్ కొట్టాలంటే.. ఎన్ని కోట్లు వసూలు చేయాలో చూద్దాం.

Kushi: ‘ఖుషీ’ కోసం కాపీ కొట్టలేదు.. సినిమాటోగ్రాఫర్ హాట్ కామెంట్స్

తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉన్న దుల్కర్ సల్మాన్ కు.. కింగ్ ఆఫ్ కొత్త మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమా నైజాంలో రూ.2 కోట్లు, సీడెడ్ లో రూ.80 లక్షలు, ఆంధ్రలో రూ2.2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను నమోదు చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ వివరాల్లోకి వెళితే… రూ.5 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను అందుకుంది ఈ మూవీ. ఇక ఈ మూవీ తెలుగులో హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే… దాదాపు రూ.5.50 కోట్ల రేంజ్ లో షేర్ సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ మూవీ టాక్ బాగుంటే.. ఈ టార్గెట్ దుల్కర్ కు కష్టమేమి కాదు. ఇప్పటికే సీతారామం సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ సాధించుకున్నారు దుల్కర్. మరి ఈ మూవీతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.