King of Kotha Movie team mistake in telugu: మలయాళ యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ భారీ అంచనాలతో నేడు విడుదలైంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ స్వయంగా నిర్మించిన ఈ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీకి అభిలాశ్ జోష్లీ దర్శకత్వం వహించగా సినిమా మీద పాన్ ఇండియా రిలీజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో వేఫార్ బ్యానర్‌పై కింగ్ ఆఫ్ కొత్త సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఈ చిత్రంలో గ్యాంగ్‍స్టర్‌గా ఫుల్ యాక్షన్ రోల్ చేసిన దుల్కర్ మాస్ లుక్‍లో అందరీనీ ఆకట్టుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ సినిమా చూసిన తెలుగు అభిమానులు ఒక విషయంలో ఫైర్ అవుతున్నారు.
King of Kotha Review: కింగ్ ఆఫ్ కొత్త రివ్యూ
అదేమని అంటే ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు కే ఓ కే అంటూ షార్ట్ కట్ లో అనౌన్స్ చేశారు. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమాకి కింగ్ ఆఫ్ కోత అని మలయాళ టైటిల్ పెట్టుకున్నారు. కోత అనేది ఒక ప్రాంతం అని చెబుతున్నా తెలుగులో దీన్ని తెరకెక్కించే సమయంలో కలగాపులగం చేసేశారు. నిజానికి తర్జుమా చేయాల్సి వస్తే కనుక కింగ్ ఆఫ్ కోధ అని రాయాలి. కానీ వీరు టైటిల్ మాత్రం కింగ్ ఆఫ్ కొత్త అని పెట్టు సినిమా మొత్తం కింగ్ ఆఫ్ కోత అని పలికించారు. ఇదంతా కొంచెం వింతగా ఉందని తెలుగు ఆడియన్స్ అంటే మరీ అంత చులకన అయిపోయారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‍గా నటించగా సార్పట్టా ఫేమ్ షబ్బీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కింగ్ ఆఫ్ కొత్తకి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.