King of Kotha Collections: ప్రతి భాషలో ఒక మాంచి మాస్ మసాలా సినిమా సూపర్ హిట్ అయింది, మనభాషలో చేస్తే ఎందుకు హిట్ అవ్వదు అనుకున్నారో ఏమో దుల్కర్ సల్మాన్ ను హీరోగా పెట్టి కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా తెరకెక్కించారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన దుల్కర్ ను గ్యాంగ్ స్టర్ గా ఒక మాంచి మాస్ మసాలా యాక్షన్ జానర్ సినిమా చేశారు. దుల్కర్ సల్మాన్ తో ఇలాంటి సినిమా అనగానే సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. ఇక పాన్ ఇండియా లెవల్లో కూడా రిలీజ్ అనగానే ఓపెనింగ్స్ అదిరిపోతాయి అనుకుంటే ఇతర భాషల జనాలకి ఎక్కకపోవడంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మినిమం ఓపినింగ్స్ కూడా చాలా చోట్ల రాలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Cicada: పాన్ ఇండియా లెవల్లో ‘సికాడా’.. టైటిలేంటీ ఇలా ఉంది?
అయితే కేరళలో మాత్రం ఇప్పుడు కలెక్షన్స్ వేరే లెవల్లో ఉన్నాయి. అక్కడి టాప్ డైరెక్టర్ దర్శకుడు జోషి కుమారుడు డైరెక్టర్ కావడం, సూపర్ ఫామ్ లో ఉన్న దుల్కర్ హీరో కావడం ఈ సినిమాకి హైప్ తీసుకురావడంతో అందరూ ఊహించినట్లుగానే రికార్డ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ క్రమంలో కేరళలో బిగ్గెస్ట్ ఓపినింగ్స్ సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. అక్కడ కేజీఎఫ్ మొదటి రోజు కలెక్షన్స్ ని కూడా కింగ్ ఆఫ్ కొత్త క్రాస్ చేసింది. మొదటి రోజు ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చినా రెండో రోజుకే కలెక్షన్స్ లో దారుణమైన డ్రాప్ నమోదవుతున్నాయి. మొదటి రోజు కేరళలో 5.75 కోట్లు వసూలు చేయగా రెండో రోజు రెండు కోట్లు కూడా రాలేదు. కానీ మొదటి రోజు సినిమా మీద ఉన్న హైప్ అందరినీ థియేటర్లకు రప్పించింది.