Site icon NTV Telugu

Shiva Re-Release : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్‌ చిత్రాల్లో ఒకటి ‘శివ’. కింగ్ నాగార్జున కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన మాస్టర్‌పీస్‌గా నిలిచింది. 1990లలో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ మూవీని మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే..

Also Read : OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..

చాలాకాలంగా “శివ త్వరలో రీరిలీజ్” అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్‌, చివరికి ఈ రోజు, అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా సెన్సేషనల్ అప్‌డేట్ ఇచ్చారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘శివ’ రీ-రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఐకానిక్ చిత్రం నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రీ-రిలీజ్‌తో మరోసారి “శివ” మేనియా థియేటర్లలో పునరావృతం కానుంది. అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకున్నారు. రీరిలీజ్‌లలో ‘శివ’ కొత్త రికార్డులు సెట్ చేస్తుందా? అన్న ఆసక్తి పెరుగుతోంది. అసలైన క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రంలో అమల హీరోయిన్‌గా నటించగా, రఘువరన్ విలన్‌గా అలరించారు. అలాగే మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది.

Exit mobile version