King Nagarjuna Unveils the Second Song from Shantala: ఇండో అమెరికన్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పణలో త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల రిలీజ్ కి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండో పాట చెలి మొహమే పాటను హీరో కింగ్ నాగార్జున తాజాగా విడుదల చేశారు. ఈ పాటను వీక్షించి నాగార్జున తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల సినిమాలోని రెండో పాటని హీరో కింగ్ నాగార్జున విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయనకి మా కృతజ్ఞతలు అని వెల్లడించారు.
Skanda: బాగోలేదంటూనే తెగ చూస్తున్నారు కదరా!
ఇక చెలి మొహమే పాటను ఎస్పిబి చరణ్ పాడగా కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు. మా సినిమాలోని రెండు పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి. హళిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రీకరించామని నవంబర్ 17 తారీకున సినిమా విడుదల అవుతుంది అని తెలియజేసారు. సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్ అయితే అక్కట్టుకునేలా సాగుతోంది.