NTV Telugu Site icon

Akkineni Nagarjuna: చిన్నప్పటి నుంచి అఖిల్ తో ప్రాబ్లమే.. డాక్టర్ కు చూపిస్తే

Nag

Nag

Akkineni Nagarjuna: రెండేళ్ల తరువాత అఖిల్ నటించిన ఏజెంట్ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టీ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ నేడు.. వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశాడు.

ఇక ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. ఏజెంట్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నారు. తాను సినిమాను చూడలేదని, కనీసం కథను కూడా వినలేదని, ఇంట్లో ఎప్పుడైనా అఖిల్ మాట్లాడితే వినడమేనని చెప్పారు. సురేండే రెడ్డి ఇండస్ట్రీకి ఎన్నిహిట్లు ఇచ్చాడో అందరికి తెలుసు అన్న నాగార్జున అనిల్ సుంకర గురించి చెప్పనవసరం లేదని, వారిద్దరూ ఈ సినిమాకు పనిచేస్తున్నారు అంటే.. అఖిల్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యినట్టే అని అన్నారు. ఇక రెండేళ్లుగా అఖిల్ ఎంత కష్టపడుతున్నాడో తాను చూశానని, 9 నెలల్లో ఇలాంటి లుక్ న్యాచురల్ గా రావడం కష్టమని, అందుకు అఖిల్ ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు.

ఇక చిన్నప్పటి నుంచి అఖిల్ హైపర్ యాక్టివ్ అని, వాడి అల్లరిని భరించలేక వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిందని చెప్పారు. డాక్టర్.. అఖిల్ ను రోజు ఆరుబయట, వాకిట్లో ఉన్న మట్టిలో గంట కూర్చోబెట్టమని.. అతనిలో ఉన్న ఎనర్జీ భూమిలోపలికి వెళ్ళిపోతుందని చెప్పినట్లు చెప్పాడు.. అంతేకాకుండా ఇప్పుడు ఆ ఎనర్జీ మొత్తాన్ని సురేందర్ రెడ్డి ఖర్చుపెట్టినందుకు ఆయనకు థాంక్స్ చెప్పారు. ఇక అభిమానులు లేకుండా ఎంతమంది, ఎన్ని సినిమాలు తీసినా హిట్లు అందుకోవని చెప్పుకొచ్చాడు. మలయాళ స్టార్ మమ్ముట్టి గురించి మాట్లాడుతూ.. ” ఏజెంట్ సినిమా హిట్ అవ్వడానికి కారణాల్లో మమ్ముట్టి ఒకరు. ఆయన సాధారణంగా ఇలాంటి సినిమాలు ఓకే చేయరు. కానీ ఏజెంట్ ను ఆయన నమ్మి చేశారు అంటే .. సినిమా హిట్ అన్నట్టే. ఆయన చాలా గ్రేట్. రీసెంట్ గా వారి తల్లిగారు చనిపోయినా.. సినిమా రిలీజ్ దగ్గరపడుతుందని డబ్బింగ్ చెప్పి వచ్చారు. అంత డెడికేషన్ ఆయనకు థాంక్స్” అని చెప్పుకొచ్చారు. ఇక ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని, అందరు ఏప్రిల్ 28 న థియేటర్ కు వెళ్లి చూడాల్సిందిగా కోరారు.