NTV Telugu Site icon

Nagarjuna: నా సామిరంగ… ఏమున్నాడ్రా కింగ్

Nagarjuna

Nagarjuna

కింగ్ నాగార్జున సంక్రాంతి సీజన్ వస్తున్నాడు అంటే హిట్ కొట్టే వెళ్తాడు. చాలా సార్లు నిజమై నిలిచిన ఈ సెంటిమెంట్ ని మరోసారి ప్రూవ్ చేయడానికి నా సామిరంగ అంటూ వస్తున్నాడు నాగ్. డెబ్యూటెంట్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న నా సామిరంగ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇటీవలే సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా టీజర్ ని రిలీజ్ చేసారు. టీజర్ లో కింగ్ నాగార్జున మస్త్ మాస్ లుక్ లో కనిపించాడు. ఈ మధ్య కాలంలో నాగార్జునని ఇంత జోష్ ఉన్న క్యారెక్టర్ లో చూడలేదు. లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ లుక్ లో నాగార్జున ఫ్యాన్స్ కి ఖుషి చేసేలా ఉన్నాడు.

అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు టీజర్ లో మరీనా ఫన్ జనరేట్ చేసారు. ముఖ్యంగా అల్లరి నరేష్ చాలా రోజుల తర్వాత కామెడీ చేసాడు. ఫన్ టోన్ లో అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. రాజ్ తరుణ్ లుక్ కంప్లీట్ కొత్తగా, విలేజ్ లుక్ లో ఉన్నాడు. అషిక రంగనాథ్-నాగార్జునల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ ఇద్దరు రెండు వెరియేషన్స్ ఉన్న లుక్ లో కనిపించారు. నాగార్జునని అటు ఫైట్స్ అండ్ ఇటు ఫన్ చేయిస్తూ చూపించడంతో టీజర్ స్పెషల్ గా మారింది. టీజర్ తో పాజిటివ్ బజ్ ని జనరేట్ చెయ్యడంలో నా సామిరంగ చిత్ర యూనిట్ కంప్లీట్ గా సక్సస్ అయ్యారు. ఇదే జోష్ లో ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తే నా సామిరంగ సినిమా సాలిడ్ హిట్ అవ్వడం గ్యారెంటీ.

Show comments