Nagarjuna: కొడుకు కోసం రంగంలోకి దిగిన కింగ్.. అఖిల్ ‘లెనిన్’ వెనుక నాగార్జున మాస్టర్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కేవలం బిజినెస్ పరంగానే కాకుండా, క్రియేటివ్ వైజ్ కూడా ఎంతో స్పెషల్ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌కు కింగ్ నాగార్జున కేవలం సపోర్ట్‌గా నిలవడమే కాకుండా, క్రియేటివ్ స్పేస్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని నాగవంశీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. మొదట దర్శకుడు నందు ద్వారా తాను ఈ కథను విన్నాను. ఆ సమయంలో అఖిల్ ఇంకా కథ వినలేదు. అయితే, అనుకోకుండా ఒకరోజు అఖిల్ కూడా ఈ కథ వినడం, ఆయనకు విపరీతంగా నచ్చేయడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “కథ చాలా బాగుంది, నేనే ఈ సినిమాను నిర్మిస్తాను సార్” అని నాగార్జున గారిని అడగ్గా, అఖిల్ కెరీర్లో ఇది కీలకమైన సినిమా కాబట్టి ఇద్దరం కలిసి చేద్దామని ఆయన ప్రతిపాదించడంతో ‘లెనిన్’ ప్రాజెక్ట్ పట్టాలెక్కిందని చెప్పారు. ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలన్నింటినీ నాగార్జున గారు పూర్తిగా నా చేతుల్లోనే పెట్టేశారని నాగవంశీ వెల్లడించారు. “ఒక్క రూపాయి బిజినెస్ లెక్కల గురించి కూడా ఆయన నన్ను ప్రశ్నించలేదు. అంతలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు” అని వంశీ తెలిపారు. అయితే క్రియేటివ్ విషయంలో మాత్రం నాగార్జున గారు చాలా కేర్ తీసుకున్నారని చెప్పారు. అఖిల్ కొంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చోవడం, రీషూట్స్ ప్లాన్ చేయడం, క్రియేటివ్ కాల్స్ తీసుకోవడం వంటివన్నీ నాగార్జున గారే దగ్గరుండి చూసుకున్నారని వెల్లడించారు. ఆయన జడ్జ్మెంట్ను నమ్మి టీమ్ మొత్తం ముందుకు సాగిందని చెప్పారు. అక్కినేని నాగార్జున పర్యవేక్షణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలతో వస్తున్న ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!