NTV Telugu Site icon

Akkineni Nagarjuna: ఆ రీమేక్ పైనే నాగ్ ఆశలన్నీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?

Nag

Nag

Akkineni Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరోలు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వరుస సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని దూసుకుపోతుంటే.. అక్కినేని నాగార్జున మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. ఘోస్ట్ వచ్చి దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పటివరకు నాగ్ నుంచి తదుపరి సినిమా ప్రకటన వచ్చింది లేదు. అయితే సినిమాల విషయాలలో ఆచితూచి అడుగులు వేస్తున్న నాగ్ ప్రస్తుతం రచయిత ప్రసన్న కుమార్ బెజవాడను దర్శకుడుగా పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మలయాళ మూవీకి రీమేక్ అంట. కథను మాత్రం తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయనున్నారట. ఇంతకూ ఆ రీమేక్ సినిమా ఏంటి అంటే మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘పెరింజు మరియమ్ జోస్’.

Nandamuri Balakrishna: బాలయ్యకు వార్నింగ్ ఇచ్చిన పిచ్చోడు.. ఎవరతను..?

జోజు జార్జ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాగ్ బాగా నచ్చడంతో పాటు తెలుగువారు కూడా మెచ్చుకుంటారని నాగ్ ఈ రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో నాగ్ తో పాటు మరో కుర్ర హీరోలు కూడా నటిస్తున్నారట. కీలక పాత్రలో అల్లరి నరేష్, మరొక ముఖ్య పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. మరి ఈ రీమేక్ కోసం నాగ్ మొట్ట మొదటిసారి కుర్ర హీరోలతో జత కడుతున్నాడు. ఈ సినిమాపై నాగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మల్టీస్టారర్ అని చెప్పలేం కానీ, ఈ కుర్ర హీరోలు కూడా మంచి సినిమాలు చేసినవారే.. దీంతో వీరి కాంబో అదిరిపోతుందని టాక్. మరి ఈ ఏడాది నాగ్ ఈ రీమేక్ తో ఏమైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Show comments