Site icon NTV Telugu

King Nag: మన్మథుడు వస్తున్నాడు… టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుగా

Manmadhudu

Manmadhudu

కింగ్ నాగార్జునకి ఉన్నంత లేడీ ఫాలోయింగ్ ఈ జనరేషన్ యంగ్ స్టార్ హీరోలకి కూడా లేదు. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు కానీ నాగార్జున హిట్స్ ని రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉండేది. ఆ రేంజ్ సినిమాలు చేసిన నాగార్జున కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ అనే లిస్ట్ తీస్తే అందులో ‘మన్మథుడు’ తప్పకుండా ఉంటుంది. విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో, త్రివిక్రమ్ డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఒక క్లాసిక్ స్టేటస్ ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈరోజుకి మన్మథుడు సినిమా టీవీలో వస్తే మిస్ అవ్వకుండా చూస్తారు. నాగార్జున గ్లామర్, బ్రహ్మీ కామెడీ, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ మన్మథుడు సినిమాని ఒక క్లాసిక్ గా మార్చాయి. అలాంటి క్లాసిక్ సినిమాని నాగార్జున బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సమయంలో మన్మథుడు వస్తున్నాడు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసుగా అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసారు. దీంతో మన్మథుడు సినిమా లవర్స్ అంతా బుకింగ్స్ ఓపెన్ చేయండి అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆగస్టు 29న మన్మథుడు సినిమాని చూడడానికి అక్కినేని అభిమానులు మాత్రమే కాదు అందరు హీరోల ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళ్లడం గ్యారెంటీ. అందరికీ నచ్చిన మూవీ కాబట్టి రీరిలీజ్ ట్రెండ్ లో మన్మథుడు సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Also: Taapsee Pannu : బ్లాక్ టాప్ లో క్లివేజ్ షో తో అదరగొడుతున్న తాప్సి..

Exit mobile version