NTV Telugu Site icon

King Khans: ఈ ఖాన్స్ లేకుండా బాలీవుడ్ లేదు…

King Khans

King Khans

ఖాన్ త్రయం… ఈ మాట వింటే చాలు దాదాపు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమని ఏలిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ గుర్తొస్తారు. ఒకరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇంకొకరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, మరొకరి బిగ్గెస్ట్ యాక్షన్ హీరో… ఈ ముగ్గురూ కలిసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకి నడిపించారు. 2018 మిడ్ నుంచి ఈ ముగ్గురు హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడం, బాలీవుడ్ కష్టాలు మొదలవ్వడం ఒకేసారి జరిగింది. 2019 నుంచి షారుఖ్, ఆమిర్, సల్మాన్ నుంచి సరైన సినిమా లేకపోవడంతో హిందీ చిత్ర పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు బాయ్కాట్ బాలీవుడ్, సుశాంత్ సూసైడ్ ఇష్యూ, నేపోటిజం బాలీవుడ్ ని పూర్తిగా కుదిపేశాయి. ఇదే సమయంలో సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై విరుచుపడ్డాయి. దీంతో హిందీ సినిమాలకి కష్టాలు ఎక్కువైపోయాయి.

ఈ కష్టాలకి ఎండ్ కార్డ్ వేస్తూ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి థియేటర్ మార్కెట్స్ ని రివైవ్ చేసాడు. ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ జవాన్ సినిమాతో ఏకంగా 1200 కోట్లు రాబట్టాడు. ఈ రెండు సినిమాలు షారుఖ్ నే కాదు బాలీవుడ్ ని కూడా బ్రతికించాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3 సినిమాతో రెండు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ బుకింగ్స్ రాబడుతున్నాడు. ఇక ఖాన్ త్రయంలో మిగిలింది ఆమిర్ ఖాన్ మాత్రమే… ఆమిర్ హిట్ కొడితే అది వెయ్యి, పదిహేను వందల దగ్గర ఆగదు… ఏకంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఆమిర్ ఫ్యాన్స్ హిట్ కోసం అంత డెస్పరేట్ గా ఉన్నారు. సో ఆమిర్ కూడా హిట్ కొట్టేస్తే ఖాన్ త్రయం మరో పదేళ్ల పాటు బాలీవుడ్ ని రూల్ చేయడం పక్కా… అందుకే అంటారు నెవర్ రైట్ ఆఫ్ ఖాన్స్ అని.