NTV Telugu Site icon

Pathaan: 1000 కోట్లు… అది షారుఖ్ ఖాన్ కంబ్యాక్ రేంజ్…

Pathaan

Pathaan

మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో షారుఖ్ ఖాన్. వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో అనే ట్యాగ్ ని ఇంటి పేరుగా మార్చుకున్న కింగ్ ఖాన్ లేటెస్ట్ సినిమా 2018లో వచ్చింది, అది కూడా ఫ్లాప్. బాక్సాఫీస్ బాద్షా అనే క్రెడిబిలిటీని సొంతం చేసుకున్న షారుఖ్ హిట్ కొట్టే పదేళ్ళు అయ్యింది. అంటే ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా షారుఖ్ కి హిట్ లేదు, అయిదేళ్లుగా అసలు సినిమానే రిలీజ్ కాలేదు. ఇలాంటి సమయంలో షారుఖ్ కంబ్యాక్ ఇస్తాడు అని నమ్మిన వాళ్లు ఉండి ఉంటారు కానీ మరీ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే రేంజులో కంబ్యాక్ ఇస్తాడు అని నమ్మి ఉండరు కానీ దాన్నే నిజం చేసి చూపిస్తున్నాడు షారుఖ్. తనని ఖాన్స్ లో కింగ్ అని ఎందుకు అంటారో? బాలీవుడ్ కి సేవియర్ అని ఎందుకు పిలుస్తారో, అసలు తన సినిమా వస్తే థియేటర్స్ దగ్గర ఆ మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో ‘పఠాన్’ సినిమాతో ప్రపంచానికే చూపిస్తున్నాడు షారుఖ్ ఖాన్.

యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఓవర్సీస్ లోనే 400 కోట్లు రాబట్టడానికి రెడీగా ఉందంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో జరుగుతుంది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. RRR, టైగర్ జిందా హై, భజరంగీ, దంగల్, KGF 2 ఇలా బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న ప్రతి సినిమా రికార్డుని బ్రేక్ చేసుకుంటూ రెండున్నర వారాలకే 900 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కు ద ఆశ్చర్యపోయేలా చేస్తుంది పఠాన్ సినిమా. లడాఖ్ లాంటి ప్రాంతంలో థియేటర్స్ హౌజ్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి అని పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి చెప్పాడు అంటే పఠాన్ సినిమా నార్త్ క్రియేట్ చేస్తున్న హావోక్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ వీకెండ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి పఠాన్ సినిమా కలెక్షన్స్ ని మళ్లీ పెరుగుతాయి.

ఈ వీకెండ్ కి పఠాన్ సినిమా మరో 50 కోట్లు రాబడితే, వెయ్యి కోట్లకి చేరువవుతుంది. అదే జరిగితే అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్లు రాబట్టిన మొదటి సినిమాగా పఠాన్ మూవీ కొత్త చరిత్ర సృష్టిస్తుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న ప్రతి సినిమా రికార్డుని బ్రేక్ చేస్తున్న పఠాన్ సినిమా ముందున్న ఏకైక రికార్డ్ బాహుబలి 2. మన సినిమా బాలీవుడ్ లో 511 కోట్లు రాబట్టింది. గత ఏడేళ్ళలో ఎన్నో సినిమాలు బాహుబలి 2 హిందీ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడానికి ట్రై చేశాయి కానీ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యాలి అంటే బాద్షా రావాల్సిందే అనే మాటని నిజం చేస్తూ.. షారుఖ్ ఖాన్ వచ్చాడు. మరి ఏడేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డుని పఠాన్ తన సొంతం చేసుకుంటాడేమో చూడాలి.