పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. తనని అందరూ బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేస్తూ ఒక యావరేజ్ సినిమాతో షారుఖ్, ఇండస్ట్రీ రికార్డులకు బ్రేక్ చేసాడు. కలెక్షన్స్ లోనే కాదు కరోన తర్వాత బిజినెస్ లేక మూతబడిన థియేటర్స్ ని కూడా రీఓపెన్ చేసేలా చేస్తున్నాడు కింగ్ ఖాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలో బాద్షాగా మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్, తను నిజంగానే హిందీ సినిమాకి ‘పఠాన్’ అని నిరూపించుకున్నాడు.
పఠాన్ కి ముందు కింగ్ ఖాన్ హిట్ స్ట్రీక్ లో లేడు, హిట్ కాదు అసలు షారుఖ్ సినిమా రిలీజ్ అయ్యే నాలుగున్నర ఏళ్లు అవుతోంది. నిజానికి బాలీవుడ్ స్లంప్ లోకి వెళ్లడానికి షారుఖ్ కూడా కారణమే, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా టాప్ మోస్ట్ స్టార్ ఫ్లాప్స్ లో ఉంటే ఆ ఇండస్ట్రీలో రెవెన్యు రొటేట్ అవ్వదు. అలాంటిది ఫేస్ ఆఫ్ బాలీవుడ్ అనేలా హిట్స్ ఇచ్చిన షారుఖ్, సినిమాలే చెయ్యకుంటే ఇంకా మనీ ఎక్కడి నుంచి రొటేట్ అవుతుంది. ఇదే సమయంలో మిగిలిన హీరోలు కూడా ఫ్లాప్స్ ఇచ్చారు, దీంతో బాలీవుడ్ స్లంప్ లోకి వెళ్లిపోయింది. బాలీవుడ్ కష్టాలకి ఎండ్ కార్డ్ వేయడానికి, మళ్లీ హిట్ స్ట్రీక్ లోకి ఎంటర్ అవ్వడానికి షారుఖ్ మొదటి అడుగు వేస్తూ వెయ్యి కోట్లు రాబట్టాడు. దీంతో బాలీవుడ్ సినిమా కష్టాలకి షారుఖ్ ఖాన్ బ్రేక్ వేసిన వాడయ్యాడు. బ్రేక్ కాదు ఈసారి ఏకంగా ఎండ్ కార్డ్ వేస్తాను అంటూ షారుఖ్… సెప్టెంబర్ 7న జవాన్ సినిమాతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు.
అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియా రికార్డులని చెల్లా చెదురు చేస్తోంది. దీంతో షారుఖ్ ఖాన్ మరోసారి వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. షారుఖ్ ఖాన్ హిట్ కొట్టడం పక్కన పెడితే, ఏ టీజర్ వచ్చినా, ఏ ట్రైలర్ రిలీజ్ అయినా నార్త్ లో ఒక వర్గం ఆడియన్స్ సోషల్ మీడియాలోకి వచ్చి బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ రచ్చ చేసే వారు. స్టార్ హీరో సినిమానా లేక చిన్న హీరో సినిమానా అనే తేడా లేకుండా ప్రతి సినిమాకి నెగటివ్ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నెగటివ్ ట్రెండ్ కారణంగా నష్టపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మొదటిసారి ఇప్పుడు ఒక్క నెగటివ్ ట్రెండ్ కూడా కనిపించకపోవడం, హిందీ సినిమాకి కలిసొచ్చే విషయం. కష్టాల్లో ఉన్న బాక్సాఫీస్ కి వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఇచ్చి కళ తెచ్చిన షారుఖ్, నెగటివ్ ట్రెండ్ కి ఎండ్ కార్డ్ వేసి హిందీ చిత్ర పరిశ్రమని బ్రతికించినవాడయ్యాడు. అందుకే షారుఖ్ ని అందరూ కింగ్ ఖాన్ అనేది. మరి ఈ కింగ్ ఖాన్, జవాన్ సినిమాతో సెప్టెంబర్ 7న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
