NTV Telugu Site icon

Kim Sharma: ‘ఖడ్గం’ బ్యూటీ ఎఫైర్స్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు..?

Kim

Kim

Kim Sharma: ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద.. అంటూ ఖడ్గం సినిమాలో కుర్రాళ్లను పిచ్చోళ్లను చేసిన హీరోయిన్ కిమ్ శర్మ. ఈ సినిమాతో అమ్మడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖడ్గం తరువాత బాలీవుడ్ కు చెక్కేసిన ఈ చిన్నది ఆ తర్వాత మగధీర చిత్రంలో పైట నలిగితే మా అమ్మ ఉరుకుంటదేంటి అంటూ చరణ్ సరసన ఆడిపాడి.. కుర్రాళ్ళను కవ్వించింది. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కన్నా ప్రేమాయాణాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. మరి ఒకటా రెండా మొత్తం నాలుగు. వారందరు మాములు వాళ్ళు కూడా కాదు ఫేమస్ సెలబ్రిటీలు. కిమ్.. కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ఎఫైర్ నడిపింది. అది ఎక్కువ కాలం నిలువలేదు. కొన్ని విబేధాలు కారణంగా వీరు విడిపోయారు. ఇక యువరాజ్ తరువాత అమ్మడి మనసు పెళ్లి మీదకు మళ్లింది. కెన్యా వ్యాపారవేత్తతో 2010లో ఆమెకు వివాహమైంది. అది కూడా అతంత మాత్రంగానే నడిచింది. కొన్నేళ్లకే ముద్దుగుమ్మ అతడికి విడాకులు ఇచ్చి.. హీరో హర్షవర్ధన్ రాణే తో మూడోసారి ఎఫైర్ మొదలు పెట్టింది. వీరిద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేశారు. ఆ తరువాత వీరి రిలేషన్ లో గొడవలు మొదలయ్యాయి.

Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా.. మిహీక పోస్ట్ వైరల్..?

ఇక హర్షవర్ధన్ వాటిని భరించలేక అమ్మడికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. మూడో ప్రియుడు వెళ్లిపోవడంతోనే కొన్నాళ్ళు సింగిల్ గా ఉన్న ఈ చిన్నది.. రెండేళ్ల క్రితం టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ తో కొత్త ప్రేమాయణానికి తెరలేపింది. అప్పటికే లియాండర్ కు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయినా వీరి బంధం మాత్రం ఆగలేదు. బీచ్ లు, రెస్టారెంట్లు అంటూ ఈ జంట విచ్చలవిడిగా తిరిగారు. సరే వీరైనా కలకాలం ఉంటారు అనుకొనేలోపు కిమ్ మరోసారి బాంబ్ పేల్చింది. లియాండర్ తో బ్రేకప్ చేసుకున్నట్లు పరోక్షంగా అభిమానులకు హింట్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ లో అతడితో ఉన్న ఫోటోలను మొత్తం డిలీట్ చేసేసింది. దీంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు విన్న నెటిజన్లు.. ఆ కిమ్ కు ప్రేమలు కొత్త కాదు బ్రేకప్ లు కొత్త కాదులే అంటూ సెటైర్లు వేస్తున్నారు.